News

Realestate News

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా నేడు బంద్‌

 

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా నేడు బంద్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వరుసగా పెట్రోల,్ డీజిల్‌ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వామపక్షాలు సోమవారం భారత్‌ బంద్‌ను నిర్వహిస్తున్నాయి. జిల్లాలో బంద్‌ నిర్వహించేందుకు ఆ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పెట్రోల,్ డీజల్‌ ధరలు పెంచడం వల్ల అన్ని వర్గాల ప్రజల పైనా ఆర్థికభారం పడుతోందని, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు  ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం, సీపీఐ నాయకులు పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోని వచ్చినప్పటికి పెట్రోలు ధరలు సుమారుగా రూ.61, డీజిల్‌ ధరలు రూ.50 పైబడి ఉండేదని, ప్రస్తుతం పెట్రోలు ధర రూ.87కి డీజిల్‌ ధర రూ.80కి పైగా చేరిందన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ బంద్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీ ఈ బంద్‌లో మరికొన్ని పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo