News

Realestate News

పెందుర్తిలో విజయా బ్యాంకు శాఖ ప్రారంభం

Vijaya Bank opening pendurti

పెందుర్తిలో విజయా బ్యాంకు శాఖ ప్రారంభం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తిలో విజయా బ్యాంకు 49వ శాఖను సోమవారం బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

బి.ఎస్‌.రామారావు, ప్రాంతీయ మేనేజర్‌ పి.శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో

భాగంగా బ్యాంకు ఆధ్వర్యంలో బాలికల విద్య, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు

, అంధ పాఠశాలలు, వికలాంగ సంస్థలకు పరికరాల అందజేత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత జ్యోతి

వెలిగించి బ్యాంకు శాఖను ప్రారంభించారు. అనంతరం బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాన్ని రిబ్బను కత్తిరించి

ప్రారంభించారు. వర్క్‌మెన్‌ డైరెక్టర్‌ వై.మురళీకృష్ణ, చీఫ్‌ మేనేజర్లు బి.రామమోహనరావు, పి.సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.