News

Realestate News

పుస్తక పఠనం అలవరచుకోవాలి


పుస్తక పఠనం అలవరచుకోవాలి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పుస్తక పఠనం అలవరచుకోవాలి

నవ్యాంధ్ర పుస్తక ప్రదర్శనలో భాగంగా ఆదివారం సాయంత్రం గురజాడ సాహిత్య వేదిక ఆవరణలో సాహితీ కార్యక్రమం జరిగింది.

అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు వారి రసగంగాధర తిలకం అంశంపై జరిగిన కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య

బాలమోహన్‌దాస్‌ పాల్గొని మాట్లాడుతూ యువత పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు.

అనంతరం జరిగిన సాహితీ సమావేశంలో ఆచార్య చందు సుబ్బారావు,

డాక్టర్‌ డి.వి.సూర్యారావు, ఆచార్య సీతారత్నంలు ప్రసంగించారు.

పుస్తక మహోత్సవానికి పెద్దఎత్తున సందర్శకులు హాజరయ్యారు.

పలురకాల పుస్తకాలను చదివి, వాటిని కొనుగోలు చేశారు.