News

Realestate News

పారిశుద్ధ్యం మెరుగు.. అభివృద్ధిలో కుదుపు

పారిశుద్ధ్యం మెరుగు.. అభివృద్ధిలో కుదుపు
జోనల్‌ కమిషనర్‌ సుబాని బదిలీ
పుట్టపర్తికి మార్చడంపై అసంతృప్తి
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే
నకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన షేక్‌సుబానిని బదిలీచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2015 ఆగస్టు 8న బాధ్యతలు చేపట్టిన ఈయన్ని పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి పదోన్నతి కల్పిస్తూ బదిలీచేశారు. ఈయన స్థానంలో ఆముదాలవలస మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎ.రామును నియమించారు. ఈయన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

జోనల్‌ కమిషనర్‌గా పనిచేసిన సుబాని డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించడంలో చూపిన చొరవ పలువురి ప్రశంసలు అందుకుంది. అయితే అన్నివిభాగాల్లోనూ బాధ్యతలు సక్రమంగా చేపట్టి అనకాపల్లిని అభివృద్ధి పథంలో నడపాల్సి ఉండగా కొన్ని శాఖల అధికారులతో ఈయనకు సఖ్యత లేకపోవడం ఇబ్బందులకు దారితీసింది. 2016లో అనకాపల్లిలో మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో గాంధీ కూరగాయల మార్కెట్‌, ఎన్టీఆర్‌ బెల్లం మార్కెట్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదని జోనల్‌కమిషనర్‌ సుబానిపై మంత్రి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో మనస్తాపం చెందిన ఈయన కొన్ని రోజులపాటు కార్యాలయానికి రాలేదు. అప్పట్లోనే ఆయనకు బదిలీ అవుతుందని ప్రచారం జరిగింది. తిరిగి బాధ్యతలు చేపట్టిన సుబాని పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం సెలవు  ఇచ్చే పద్ధతి అనకాపల్లిలో కొనసాగుతోంది. దీన్ని మార్చి షిఫ్టుల ప్రకారం వారంలో  ఏడురోజులు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించాలని మంత్రి ఆదేశించినా ఇది అమలుకాలేదు. డంపింగ్‌యార్డు వద్ద పొడిచెత్త వనరుల కేంద్రాన్ని ఏర్పాటుచేసి చెత్త నుంచి ఆదాయాన్ని సేకరించే పనులు చేపట్టారు. ఇంటి పన్నుల వసూలుపై చూపిన చొరవతో మొండిబకాయిలను సైతం వసూలయ్యాయి. ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభాగం, ఇతర శాఖ అధికారులతో జోనల్‌కమిషనర్‌కి సఖ్యత లోపించేది. దీనివల్ల ఒక్కోసారి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడేవి. 2020 జనవరిలో సుబాని పదవీవిరమణ చేస్తుండగా.. ఈ సమయంలో తనను కొంత మంది ఉన్నతాధికారులు పనికట్టుకుని దూర ప్రాంతానికి బదిలీచేశారని ఆయన కొందరి వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈయన స్థానంలో జోనల్‌ కమిషనర్‌గా నియమితులైన రాము ఇప్పటికే విశాఖపట్నంలోని కార్యాలయంలోని కమిషనర్‌ను కలిశారు. మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo