News

Realestate News

పారదర్శకంగా రహదారి విస్తరణ సర్వే

survey of the expansion of the road

పారదర్శకంగా రహదారి విస్తరణ సర్వే

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే(Transparent survey of the expansion of the road): అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేపడుతున్న రహదారి విస్తరణ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిపార్ట్‌మెంట్‌ సహాయ సంచాలకురాలు మనీషా త్రిపాఠి పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి ఆనందరం పురం వరకు సబ్బవరం రహదారికి చేపడుతున్న విస్తరణ సర్వే పనులను ఆమె శుక్రవారం శంకరం గ్రామం వద్ద పరిశీలించారు. విస్తరణకు సంబంధించి వివరాలను ఆమె అనకాపల్లి మండల సర్వేయర్‌ లీలాను అడిగి తెలుసుకున్నారు. రహదారి మధ్య నుంచి అటు ఇటు వంద అడుగుల మేర సర్వే చేపడుతున్నామని.. సర్వే పూర్తయిన ప్రతిచోటా మార్కింగ్‌ పనులు చేస్తున్నామని సర్వేయర్‌ తెలిపారు. అనంతరం మామిడిపాలెం గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న సర్వే పనులను పరిశీలించడానికి ఏడీ వెళ్లారు. కార్యక్రమంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు జి.శ్రీనివాసరావు, ఎస్‌.అర్జున్‌, ఎస్‌.నాగేశ్వరరావు పాల్గొన్నారు.*