News

Realestate News

పాఠశాల అభివృద్ధికి చేయూత అందిస్తాం


పాఠశాల అభివృద్ధికి చేయూత అందిస్తాం

సీలేరు పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సీలేరు, న్యూస్‌టుడే:  పాఠశాల అభివృద్ధికి చేయూత అందిస్తాం

సుమారు మూడు దశాబ్దాల కిందట పదో తరగతి వరకు వారంతా కలిసి చదువుకున్నారు.

ఉన్నత చదువులు చదివి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు.

వారంతా శుక్రవారం సమావేశమమయ్యారు.

సీలేరు జడ్పీ పాఠశాల దీనికి వేదికైంది.

నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సేవలను కొనియాడారు.

వీరిలో కొంతమందిని సత్కరించారు.

సీలేరు, చిత్రకొండ పరిసర గ్రామాలకు చెందిన 1989-90 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి

ఆత్మీక సమ్మేళనం నిర్వహించారు.

ఇందుకు పూర్వ విద్యార్థులు రాంప్రసాదు, శ్రీనివాసరావు, నాగుర్‌మీరా తదితరులు చొరవ చూపారు.

ఈ సమావేశానికి 38 మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

పాఠశాలలో అడుగుపెట్టగానే నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని పులకించారు.

తరగతి గదులన్నీ తిరిగి అప్పట్లో వారున్న ఇళ్లను సందర్శించారు.

మిత్రులకు కుటుంబ సభ్యులను పరిచయం చేశారు.

కేకు కోసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.

పాఠశాల అభివృద్ధికి చేయూత అందించేందుకు నిధిని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

28 ఏళ్ల తర్వాత స్నేహితులను కలవడం మరిచిపోలేని తీపి జ్ఞాపకమని బలిమెలకు చెందిన సాబిరా బేగం ఆనందం

వ్యక్తం చేశారు.

కుటుంబ సమేతంగా అందరూ సమావేశానికి హాజరై సరదాగా గడిపామని కాకినాడకు చెందిన రాజా చెప్పారు.

‘పదేళ్లపాటు ఇక్కడే ఉండి పదో తరగతి వరకు చదివా.

విశాఖలో స్థిరపడ్డా.

నాటి గురువులు, స్నేహితులను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంద’ని వర్మ అన్నారు.

నాడు ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, బోధించిన పాఠాలు ఈ స్థాయికి చేర్చాయని పూర్వ విద్యార్థి రాంప్రసాద్‌

పేర్కొన్నారు.