News

Realestate News

పాఠశాలలకు నేషనల్‌ గ్రీన్‌కోర్‌ నిధులు

పాఠశాలలకు నేషనల్‌ గ్రీన్‌కోర్‌ నిధులు

జుత్తాడ (చోడవరం), న్యూస్‌టుడే:పాఠశాలలకు నేషనల్‌ గ్రీన్‌కోర్‌ నిధులు..

  జిల్లాలోని పాఠశాలలకు నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ నిధులు మంజూరవుతాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌

జిల్లా సమన్వయకర్త ఎల్‌.ఇ.ఎ.ఎన్‌.ఎస్‌. మూర్తి తెలిపారు.

ఈ మేరకు ఆయన  శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ నిధుల కోసం ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీలోగా పాఠశాలలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని పేర్కొన్నారు.

ఇలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న పాఠశాలకు రూ. అయిదు వేల మేర నిధులు జమవుతాయని తెలిపారు.

ఈ నిధులతో చేపట్టే గ్రీన్‌ కార్యక్రమాలను ప్రతి పాఠశాల ఈ నెల 16వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేయించాల్సి ఉంటుందని మూర్తి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నిధులు పాఠశాలలకు మంజూరు చేస్తున్నారన్నారు.

ఇతర వివరాలకు  9441333150 నెంబరు ఫోన్‌ చేయాలని మూర్తి సూచించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo