News

Realestate News


పవన్‌కళ్యాణ్‌ బాధ్యతగా మాట్లాడాలి

అరకులోయ, న్యూస్‌టుడే:పవన్‌కళ్యాణ్‌ బాధ్యతగా మాట్లాడాలి.

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత

పవన్‌కళ్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని సోమ భార్య ఇచ్ఛావతి డిమాండు చేశారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమపై జనసేన కవాతులో పవన్‌కళ్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇచ్ఛావతి ఆరోపించారు. అన్యాయానికి

గురైన గిరిజన నాయకుడి కుటుంబంపై పవన్‌కళ్యాణ్‌ సానుభూతి చూపకుండా మావోలకు మద్దతుగా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. భర్తను కోల్పోయి

పుట్టెడు దుఃఖంలో ఉన్న తాను ఆడపడుచును కాదా అని ప్రశ్నించారు. మహిళా మావోయిస్టు మృతిపై ఎందుకు కనికరం చూపుతున్నారన్నారని

ప్రశ్నించారు. సామాజిక న్యాయం అంటున్న ఆయనకు కిడారి, సోమ కుటుంబాల దుఃఖం కనిపించడం లేదా అని మండిపడ్డారు. పవన్‌కళ్యాణ్‌ తన

వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. సోమ కుమారుడు అబ్రహం మాట్లాడుతూ.. ఎవరో రాసిన కాగితాన్ని

చూసి ప్రసంగించే పవన్‌కళ్యాణ్‌ నేరుగా మా ఇంటికి వచ్చి పరిస్థితిని చూసి మాట్లాడాలని కోరారు. గిరిజనులను చిన్నచూపు చూడటం భావ్యం

కాదన్నారు. క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తెదేపా అరకులోయ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు, మాజీ

సర్పంచులు రఘునాథ్‌, మహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తిరుగుతూ నక్సలిజాన్ని పురికొల్పేలా మాట్లాడటం

సరికాదని తెదేపా జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. మంగళవారం అచ్యుతాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఉంటూ నక్సలిజం గురించి మాట్లాడడం ఏమిటని నిలదీశారు. నిరంతరం గిరిజన సమస్యల పరిష్కారానికి, ఆ ప్రాంత అభివృద్ధికి

కృషి చేసిన ఇద్దరు గిరిజన నాయకులను మావోయిస్టులు కిరాతకంగా హత్యచేసినా పవన్‌కళ్యాణ్‌ వారి కుటుంబాలను పరామర్శించడానికి

వెళ్లలేదన్నారు. కనీసం మానవీయకోణంలో ఈ సంఘటలను ఖండించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. తిత్లీ తుపానుతో సర్వం కోల్పోయిన

రాష్ట్రానికి మంచిదికాదని పంచకర్ల పవన్‌కు సూచించారు. ఈ సమావేశంలో ఎలమంచిలి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దూలి రంగనాయకులు, కనకరాజు

తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo