News

Realestate News

పర్యాటకులను ఆకట్టుకునేలా నమూనాలు

పర్యాటకులను ఆకట్టుకునేలా నమూనాలు
మంత్రి గంటా ఆదేశం
ఎం.వి.పి.కాలనీ: విశాఖకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్న తరుణంలో పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకునేలా సందర్శనీయ ప్రదేశాల నమూనాలను రూపొందించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. వుడా వీసీ బసంత్‌కుమార్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, ఆర్కిటెక్‌ మూర్తితో ఆయన వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రధానంగా యారాడ కొండల అభివృద్ధి, బొటానికల్‌ గార్డెన్‌, అంతర్జాతీయ గోల్ఫ్‌ కోర్టు, రెస్టారెంట్‌లకు సంబంధించిన నమూనాలను ఆయన పరిశీలించారు. ఇంకా మెరుగైన నమూనాలను రూపొందించాలని సూచించారు. యారాడ కొండల ప్రాముఖ్యతను ఇనుమడింపచేసేలా డిజైన్స్‌ వేయాలన్నారు. కైలాసగిరిపై చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్షించగా, అతిత్వరలో దీనిపై నివేదిక ఇస్తామని వీసీ బసంత్‌కుమార్‌ తెలిపారు. నగరంలో మల్టీలెవల్‌ పార్కింగ్‌, భూగర్భమార్కెట్‌, క్రీడానగరం, ఫ్లైఓవర్‌ పథకాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo