News

Realestate News

పర్యాటకాభివృద్ధికి చర్యలు: కలెక్టర్‌


పర్యాటకాభివృద్ధికి చర్యలు: కలెక్టర్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే:పర్యాటకాభివృద్ధికి చర్యలు: కలెక్టర్‌.

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటక రంగ ప్రగతికి జిల్లాలో అనేక

అవకాశాలున్నాయని, అటువంటి వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు.

బీచ్‌రోడ్డు సందర్శనకు విదేశీయులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని,

ఆయా చోట్ల వారికి అవసరమైన వసతులు కల్పించాలన్నారు.

అరకు, లంబసింగి వంటి ప్రాంతాల విశిష్టత తెలియజేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

దేవరాపల్లి దగ్గరలో ఉన్న సరియా జలపాతం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, చాపరాయి,

పద్మాపురం ప్రాంతాలను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు.

సముద్రతీర ప్రాంతంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై దృష్టి సారించాలన్నారు.

వీఎంఆర్‌డీఏ వైస్‌ఛైర్మన్‌ బసంతకుమార్‌, జేసీ సృజన, పర్యాటక శాఖ ఆర్‌డి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను సాధించే బాధ్యత ప్రతీ అధికారిపై ఉందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు.

మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్‌ వివిధ శాఖలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అభివృద్ధి సూచికలపై ఈనెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సును సీఎం నిర్వహించారని,

ఇక మీదట ప్రతీ నెలా ఈ సదస్సులుంటాయని చెప్పారు.

ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారులంతా మరింత అప్రమత్తంగా పనిచేస్తూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

సమావేశంలో సీపీఓ రామశాస్త్రి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం ఉపాధి హామీ పథకం అమలుపై ఆయన అధికారులతో సమీక్షించారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంకుడు గుంతల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo