News

Realestate News

పన్నురేట్లు తగ్గిస్తేనే ప్రయోజనం

పన్నురేట్లు తగ్గిస్తేనే ప్రయోజనం

                                                                                

వడ్డీరేట్ల తగ్గింపుతో గిరాకీ పెరగకపోవచ్చు
ఎస్‌బీఐ రీసెర్చ్‌

పన్నురేట్లు తగ్గిస్తేనే గిరాకీ పెంచేందుకు వీలవుతుందని ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో, గిరాకీ పెంచేందుకు వడ్డీరేట్లు తగ్గించాలనే డిమాండ్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి వస్తున్న తరుణంలో ఆర్థిక వేత్తలు ఇలా స్పందించారు.

వృద్ధిరేటు పెరగాలంటే, వినియోగం పెరగాలని, ఇది జరిగేందుకు పన్నురేట్ల కోతే అధికంగా ఉపయోగ పడుతుందనే భావనను వ్యక్తం చేశారు. పరోక్ష పన్నురేట్లను తగ్గించినా కూడా వినియోగం పెరుగుతుందని అన్నారు. 6 బ్యాంకుల నుంచి రుణ గిరాకీ వివరాలను సమీకరించి, విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.