News

Realestate News

పథకాల్లో మనదే రికార్డు..ప్రజల్లోకి తీసుకెళ్లండి

 

పథకాల్లో మనదే రికార్డు..ప్రజల్లోకి తీసుకెళ్లండి

 బూత్‌ కన్వీనర్లతో మంత్రి అయ్యన్న

అనకాపల్లి, న్యూస్‌టుడే: ‘రాష్ట్ర ప్రభుత్వం 132 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి పథకంపై నాయకులకు పూర్తి అవగాహన ఉండాలి.  దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రం మరొకÛటి లేదు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని చాలా మంది ప్రజాప్రతినిధులకే ఈ పథకాలు గురించి పూర్తిగా తెలియడం లేదు’  అని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

స్థానిక జార్జిక్లబ్‌లో నర్సీపట్నం నియోజకవర్గం బూత్‌ కమిటీ కన్వీనర్లకు శిక్షణ తరగతలు నిర్వహిస్తున్నారు. వీటిని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులున్నా రాష్ట్రాభివృద్ధి గురించి నిరంతరం శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని కొనియాడారు.

బాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా చంద్రబాబును బలపరచాల్సిన అవసరం ఉందని  చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నందునే ప్రధాని మోదీని వ్యతిరేకించాల్సి వచ్చిందని వివరించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగువాడై ఉండి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నించకుండా లేనిపోని కబుర్లు చెప్పడం తగదన్నారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు కనీసం అవగాహన లేదని మంత్రి అయ్యన్న ఆరోపించారు. జగన్‌ పూర్తిగా బురదలో కూరుకుపోయారన్నారు.

నవరత్నాలు అమలు చేస్తామని చెబుతున్నా విశాఖ జిల్లాలో ఇంతవరకు దానిలో ఒక్క పథకం గురించి మాట్లాడలేదని చెప్పారు. ఎంతసేపు ముఖ్యమంత్రిని తిట్టడానికే సరిపోతుందన్నారు. రాజకీయ నాయకుడు వేరు, నాయకుడు వేరన్నారు. లేని సమస్యలు సృష్టించి దానిపై బతికేవాడే రాజకీయ నాయకుడని, ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేవాడు నాయకుడని పేర్కొన్నారు.

జగన్‌ రాజకీయ నాయకుడైతే, చంద్రబాబు నాయకుడని అని అయ్యన్న అన్నారు. పోలవరం శరవేగంగా నిర్మాణం చేస్తున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలాశయం లేకుండానే లంచాల కోసం కాలువలను తవ్వారన్నారు.

ఇంతవరకు రాష్ట్రంలోని 1.7 లక్షల మంది రైతులు ఈ నిర్మాణపనులు చూశారన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ గ్రామీణ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు, శిక్షకులు డేవిడ్‌ రాజు, శ్రీధర్‌, రాజు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo