Posted on September 07, 2017 by vijay kumar in Realestate News
పట్టుదలతో కృషి చేస్తే విజయం తథ్యం
కేరళ హైకోర్టు న్యాయమూర్తి దామశేషాద్రినాయుడు
సీతంపేట, న్యూస్టుడే :విద్యార్థులు ఒక లక్ష్యంతో పట్టుబట్టి చదివితే విజయం వారి సొంతమవుతుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామ శేషాద్రినాయుడు అన్నారు. బుధవారం రామాటాకీస్ దరి డాక్టర్ అంబేడ్కర్ భవన్లో ‘భారతదేశంలో సృజనాత్మక మార్పులు – విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై జస్టిస్ దామ శేషాద్రినాయుడు ప్రసంగించారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ నాయుడు ఆదిత్య కళాశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ‘పట్టుబట్టరాదు.. పట్టిన పట్టు విడువరాదు’ అన్న వేమన పద్యాన్ని వినిపించి విద్యార్థులను చైతన్యపర్చారు. తాను చదువుకున్న రోజుల్లో ఇప్పటి సౌకర్యాలతో కూడిన విద్యా వ్యవస్థలు లేవంటూ తన చిన్నతనం రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముత్యాలనాయుడు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం విద్యావ్యాప్తికి అనేక వసతులున్నాయన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో అత్యున్నత పదవిని అలంకరించారని, ఒక విజ్ఞానవేత్త రాష్ట్రపతిగా వ్యవహరించాక కూడా ఉపాధ్యాయుడు కాగలరని డాక్టర్ అబ్దుల్ కలాం నిరూపించారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్.వి.బాబ్జి, ఆదిత్య బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ కె.జగదీశ్వరరావు, న్యాయవాది శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399