News

Realestate News

పచ్చదనానికి ప్రతీక ఈ పాఠశాల

vizag real estate news

దేవరాపల్లి, న్యూస్‌టుడే: పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనం దేవరాపల్లి మండలం కాశీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. హరిత శోభతో నిండిన ఈ పాఠశాల ప్రాంగణం చూసేవారికి ఎంతో శోభాయామానంగా కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఈ గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల నెలకొల్పిన తొలినాళ్లలోనే బీజం నాటారు. అందుకే ఈ పాఠశాల నేటికీ పచ్చలహారంగా కనిపిస్తుంటుంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది ఈ పాఠశాలలో మొక్క్కలు నాటే కార్యక్రమం జరుగుతూనే వుంటుంది. ఈ పాఠశాల ప్రాంగణంలో ఓ వైపు చూస్తే పెరుగుతున్న మొక్క్కలు కనిపిస్తాయి. మరోవైపు చూస్తే ఎదిగిన చెట్లు కనిపిస్తాయి. ఇటు పర్యావరణ పరిరక్షణకు, అటు పచ్చదనాన్ని

కాశీపురం పాఠశాల గురించి
ఈ పాఠశాల 1999లో ఏర్పడింది.
ప్రస్తుతం ఈ పాఠశాలలో సుమారు 240 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రధానోపాధ్యాయురాలితో పాటు 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
11 తరగతి గదులు వున్నాయి.

పర్యావరణంలో ‘ఉన్నత’ విలువలు
1999లో ఏర్పడిన కాశీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పర్యావరణ పరిరక్షణలో ఉన్నత విలువలను కాపాడుకుంటూ వస్తుంది. ఈ పాఠశాల ప్రవేశద్వారం నుంచే పచ్చదనం పలకరిస్తుంది. మైదానంలో పచ్చదనానికి ప్రతీకగా నిలిచే అనేక మొక్క్కలతోపాటు ఫలసాయాన్ని అందించే మామిడి చెట్లు వున్నాయి. వీటితో పాటు యూకలిప్టస్‌, చెర్రీస్‌, టేకు, జామ, మద్ది, సపోట, వేప, ఉసిరి, నేరేడు వంటి అనేక రకాలైన ఔషధ, పండ్ల జాతి వంటి వన సంపదకు ఈ ప్రాంగణం నిలయంగా మారింది. ఈ పాఠశాలలోని మామిడి చెట్ల నుంచి వచ్చే ఫలసాయాన్ని ప్రతి ఏటా వేలంవేసి ఆ సొమ్మును పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయడం పరిపాటిగా వస్తుంది.

నిత్యం మొక్క్కలను సంరక్షిస్తాం
పాఠశాల పని వేళల్లో కాకుండా ఖాళీ సమయాల్లో మా పాఠశాల ఆవరణలోని మొక్క్కలు ప్రతి రోజు సంరక్షిస్తాం. ఎప్పటికప్పుడు మొక్క్కల ఎదుగుదల పరిశీలిస్తాం. మొక్క్కలక చుట్టూ ఎటువంటి కలుపు మొక్క్కలు లేకుండా చూస్తాం. ప్రతి ఏడాది ఎన్నో కొన్ని మొక్క్కలు నాటుతుంటాం. అందువల్లే మా పాఠశాల ఆవరణలో కొన్ని మొక్క్కలు కనిపిస్తే మరికొన్ని చెట్లు కనిపిస్తాయి.

– ఎన్‌.నాగమణి, ప్రధానోపాధ్యాయురాలు, కాశీపురం

మొక్క్కల సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నా
మొక్క్కల సంరక్షణ బాధ్యతను పూర్తిగా నేనే తీసుకుంటున్నాను. పిల్లలు ఖాళీ సమయాల్లో వారిని మైదానంలోకి తీసుకెళ్లి చుట్టూ పాదులు కట్టించి వారి ద్వారా వాటిని రక్షిస్తున్నాను. ఇటువంటి ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేయడం ఆనందంగా వుంది.

– బోను అప్పలనాయుడు, వ్యాయామోపాధ్యాయుడు

ఈ పాఠశాలలో చదివినంత వరకు తోట పని చేస్తాం
ఈ పాఠశాలలో చదివినంత కాలం కొంత సమయాన్ని తోట పనికి కేటాయిస్తాం. ఈ విధంగా చేయడం వలన మొక్క్కలన్నీ బాగా ఎదుగుతాయి. పర్యావరణం కూడా అభివృద్ధి చెందుతుంది. మేము ఇక్క్కడి నుంచి ఉన్నత చదువులకు వెళ్లిపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఈ పాఠశాలకు వచ్చినప్పుడు మేము చదివిన కాలంలో మొక్క్కలక చేసిన సంరక్షణ ఫలాలు మా ముందు కనిపిస్తే అంతకన్నా గొప్ప ఇంకేముంటుంది.

-కొయ్య వసంత, బండారు దేవి, 8వ తరగతి, కాశీపురం

మొక్క్కలు పెంపకమంటే చాలా ఇష్టం
మొక్క్కలు పెంచడమంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. అందుకే పాఠశాలలో ఖాళీగా వున్నప్పుడు ఏదో మొక్క్కలు దగ్గరకు వెళ్లి దాని చుట్టూ వున్న కలుపు మొక్క్కలన తీస్తుంటాం. ఆ మొక్క్కలు చుట్టూ పాదు కట్టి నీరు పోస్తుంటాం. ప్రతి ఒక్క్కరు మొక్క్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం చాలా ముఖ్యం.

– చిటిమిరెడ్డి రాము, నాలం సతీష్‌, 8వ తరగతి, కాశీపురం

 


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo