అరకులోయ పట్టణం, న్యూస్టుడే: అరకులోయ పరిసరాల్లో పచ్చదనంపై పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే జరిగింది. హైదరాబాదు నుంచి వచ్చిన బృందం సోమవారం ఆకాశంలో ఎగిరే రిమోట్ డ్రోన్ పరికరంతో అరకులోయ మయూరి అతిథి గృహం వద్ద ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేపట్టారు. ఆకాశంలో ఎగిరిన ఈ పరికరం పర్యటక శాఖ మయూరి అతిథిగృహం నుంచి రెండు కిలోమీటర్లు పరిధిలో గల చొంపి గ్రామం వరకు ఎగురుతూ వెళ్లి ఫొటోలను చిత్రీకరించి వెనుతిరిగివచ్చింది. అరకులోయలో ఈ తరహా సర్వే చేపట్టడం తొలిసారి కావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దీనిపై పూర్తివివరాలు చెప్పడానికి బృందం సభ్యులు నిరాకరించారు.
Source : http://www.eenadu.net/
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399