News

Realestate News

పక్కా ప్రణాళికతో సింహగిరి అభివృద్ధి

పక్కా ప్రణాళికతో సింహగిరి అభివృద్ధి

దశలవారీగా వంద కల్యాణ మండపాలు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రాన్ని పక్కా ప్రణాళికతో దశలవారీగా ఆభివృద్ధి చేస్తామని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆశోకగజపతిరాజు అన్నారు. శనివారం ఆయన అప్పన్న ఆలయ పాకశాలను ప్రార¹ంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సింహగిరిపై భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండుమూడేళ్లలో 300 గదులు, వంద కల్యాణ మండపాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని కొండమెట్ల మార్గాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ అనుమతించారన్నారు. వచ్చే గిరిప్రదక్షిణ ఉత్సవం నాటికి ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాన్ని మరో 25 అడుగుల వెడల్పుతో అందంగా తయారు చేయాలన్నది లక్ష్యమన్నారు.

నూతనంగా నిర్మించిన పాకశాల ఒకభాగంలో స్వామివారి ఆభరణాల ప్రదర్శనశాలగా మార్చలన్న ఆలోచన మంచిదన్నారు. భక్తులు దానమిచ్చిన ఆభరణాలు భక్తులు తిలకించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దాతల సహకారంతో కాటేజీల నిర్మాణాలు చేపట్టేటపుడు దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆయన అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడ మండపంలో పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్‌ స్వామి ప్రసాదం అందజేశారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo