News

Realestate News

న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది

pressure on judges

న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది

ఆరిలోవ, న్యూస్‌టుడే: సిబ్బంది, ఇతర సౌకర్యాల లేమి కారణంగా హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని హైకోర్టు

న్యాయమూర్తి సి.వి.నాగార్జునరెడ్డి అన్నారు. విశాఖపట్నం ముడసర్లోవ సమీపంలోని దీనదయాళపురంలో ఎ.పి. వ్యాట్‌

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేశారు. ఉమ్మడి హైకోర్టులో 61 మందికి గాను 33 మంది

మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారన్నారు. వాణిజ్యపన్నుల శాఖ ట్రిబ్యునల్‌లో సుమారు 2వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు

తెలుస్తోందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల కోసమో కోర్టులు లేవని, ప్రజలకు న్యాయం అందించడం కోసం ఏర్పాటు

చేసినవని అందరూ గుర్తెరగాలన్నారు. న్యాయమూర్తులు, ఇతర న్యాయాధికారులు, న్యాయవాదులు సమన్వయంతో

పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలకు పన్నులే ప్రధాన ఆధారమన్న విషయాన్ని గ్రహించి పన్నుదారులు

బాధ్యతతో వ్యవహరించాలన్నారు. భవనం ఆవరణలో మొక్కను నాటిన అనంతరం శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జరిగిన సభలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య, ఎ.పి.ట్రిబ్యునల్‌

ఛైర్మన్‌, న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి, ట్రిబ్యునల్‌ రాష్ట్ర ప్రతినిధులు శివశంకర్‌రావు, మార్కెండేయ శర్మ, ట్రిబ్యునల్‌ విభాగం

సభ్యులు హర్షవర్థన్‌ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ జి.వెంకటేశ్వరరావు, ఎ.పి. టాక్స్‌ బార్‌ అసోసియేషన్‌

అధ్యక్షులు సర్వేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo