Posted on December 13, 2016 by vijay kumar in Realestate News
నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సబ్బవరం: సబ్బవరం మండలం నల్లరేగులపాలెంలో రూ.3.23 కోట్లతో నిర్మించనున్న విజయరామసాగరం రిజర్వాయరు నిర్మాణ పనులకు మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేస్తారని సబ్బవరం మండల తెదేపా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు తెలిపారు. రూ.1.80 కోట్లతో నల్లరేగులపాలెం నుంచి ద్వారకానగర్ మీదుగా నారపాడు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభిస్తారన్నారు. రూ. 3.80 కోట్లతో నిర్మించనున్న మంచినీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమ, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.