నేడు అంతర్జాతీయ సదస్సు
నేడు అంతర్జాతీయ సదస్సు
పాల్గొననున్న నోబెల్ శాంతి బహుమతి గృహీత మహ్మద్ యూనస్..
ఏయూ ప్రాంగణం(International Conference): వుడా చిల్డ్రన్స్ థియేటర్లో సోషల్ బిజినెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశంపై గురువారం అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇందులో నోబెల్ శాంతి బహుమతి గృహీత మహ్మద్ యూనస్, పలువురు దేశ, విదేశాల శాస్త్రవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యనపాత్రుడు, ఎంపీ హరిబాబు, పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నెల 7 వరకు సదస్సు జరుగుతుంది. తొలిరోజు యూనస్ కీలకోపన్యాసం చేస్తారు. రెండో రోజు పర్యావరణం, విద్యుత్తు, పారిశ్రామిక తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు అవినీతి నిరోధంపై కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి ప్రసంగం ఉంటుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతోను ముఖాముఖి ఉంటుంది. 7వ తేదీన సాంకేతిక అంశాలపై చర్చ ఉంటుంది. ఇవి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతాయి.