నేటి నుంచి రెండో విడత డీఎస్సీ
నేటి నుంచి రెండో విడత డీఎస్సీ
జిల్లా వ్యాప్తంగా జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు మలివిడత డీఎస్సీ (కంప్యూటర్ బేస్డ్) పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి
బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. కేటాయించిన పరీక్షా కేంద్రానికి గంటముందు (ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు) చేరుకోవాలని
సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు) చూపిస్తేనే
పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. అంగవైకల్య, అంథ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సహాయకులు కావాలంటే అంగవైకల్య ధ్రువపత్రం
నకలు సమర్పించటమే కాకుండా ఒరిజినల్ కూడా తీసుకురావాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు.