News

Realestate News

నేటి నుంచి పగడాలమ్మ జాతర

నేటి నుంచి పగడాలమ్మ జాతర
సంతకవిటి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పగడాలమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మూడో రోజైన ఆదివారం అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు జిల్లా నుంచే కాకుండా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. జాతర సందర్భంగా ప్రతి ఏటా ఆలయ కమిటీ జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 7, 8వ తేదీల్లో పోటీలు నిర్వహించనున్నారు.