నీటి పథకాల నిర్వహణపై ప్రపంచబ్యాంకు బృందం ఆరా
నీటి పథకాల నిర్వహణపై ప్రపంచబ్యాంకు బృందం ఆరాచింతపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఐదేళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రక్షిత నీటి పథకాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సభ్యులు చక్రవర్తి, పావని తెలిపారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ చినబరడ గ్రామంలో బుధవారం ప్రతినిధి బృందం పర్యటించింది. పెదబరడ పంచాయతీలో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు ఎనిమిది ఉన్నాయి. ఇందులో చినబరడను ఎంపిక చేసుకున్న బృందం సభ్యులు గ్రామాన్ని సందర్శించి స్థానిక గిరిజనులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న ఆవాసాలు, జనాభా, రక్షిత నీటి పథకం నిర్మించకముందు తాగునీటికి పడ్డ ఇబ్బందులు, అందుబాటులోకి వచ్చాక పరిస్థితి, పథకం నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం, ఇబ్బందులు వంటి వివరాలన్నింటినీ గిరిజనులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చక్రవర్తి, పావని మాట్లాడుతూ 2013లో ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం, ప్రకాశం, కడప జిల్లాల్లో అనేక గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాలను నిర్మించామన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో 266 గ్రామాల్లో రక్షిత నీటి పథకాల నిర్మాణం జరిగిందన్నారు. పథకాలు నిర్మించి ఐదేళ్లవడంతో ఈ మూడు జిల్లాల్లో ఎన్ని పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని దానిపై ఆరా తీస్తున్నామన్నారు. తొలిసారి విశాఖ జిల్లా చింతపల్లి మండలం చినబరడ గ్రామాన్నే తాము ఎంపిక చేసుకున్నట్టు బృందం సభ్యులు తెలిపారు. కొయ్యూరు మండలం రావణాపల్లితోపాటు పద్మనాభంలోనూ పర్యటిస్తామని తెలిపారు. పెదబరడ పంచాయతీలో ప్రజల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి పథకాల సమర్ధంగా నిర్వహిస్తున్నామని సర్పంచి బోయిన సత్యనారాయణ బృందం సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధులు బక్షి, సత్యనారాయణ, నాయుడు, మురళి, చింతపల్లి మండల తాగునీటి సరఫరా విభాగం జేఈ సాగర్, తాగునీటి సరఫరా విభాగం క్షేత్ర సమన్వయకర్త రాణి, పంచాయతీ కార్యదర్శి అపర్ణ పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399