News

Realestate News

నిర్మిత కేంద్రాలకు పునర్జీవం

vizag real estate news

నిర్మిత కేంద్రాలకు పునర్జీవం
ప్రభుత్వ కసరత్తు
ఎన్టీఆర్‌ గృహాలకు సామగ్రి సరఫరా యోచన
రోలుగుంట, న్యూస్‌టుడే: కొంతకాలంగా మూసివేసిన గృహ నిర్మాణ శాఖ నిర్మిత కేంద్రాలను మళ్లీ తెరిచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి అవసరమైన కరసత్తు జరుగుతోంది. నిర్మిత కేంద్రాల్లో తయారయ్యే సామగ్రిని ఇటీవల మంజూరైన ఎన్టీఆర్‌ గృహాలకు వినియోగించడం ద్వారా లబ్ధిదారుల అంచనా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకుగానూ జిల్లాలోని నిర్మిత కేంద్రాలకు పట్టిన బూజు దులుపుతున్నారు.

జిల్లాలోని రోలుగుంట, నక్కపల్లి, అగనంపూడి, పాడేరు, చింతపల్లి గొలుగొండ తదితర ప్రాంతాల్లో 2005లో జిల్లా గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యాన నిర్మిత కేంద్రాలు ప్రారంభించారు. అప్పట్లో ఇంటి ద్వారబంధాలు, కిటికీలు, వెంటిలేటర్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల గుంతలపై మూతలతో పాటు సిమెంట్‌ ఇటుకుల తయారీ చేపట్టేవారు. ఆ సామగ్రిని ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసేవారు. నీటిలో క్యూరింగు చేసిన తరువాత లబ్ధిదారులకు వీటిని అందజేసేవారు. అయితే వీటిలో ఒక్క సిమెంట్‌ ఇటుకలు తప్పా మిగతా సామగ్రిపై లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు.

తప్పనిసరితో ఇబ్బంది…
కొద్దిరోజుల పాటు ఇళ్లకు ఈ సామగ్రినే వినియోగించేలా తప్పనిసరి చేశారు. ఇందుకయ్యే ఖర్చు ఇంటి బిల్లుల నుంచి తీసుకునే వారు. ఆ ప్రక్రియపై లబ్ధిదారుల నుంచి నిరాసక్తత వ్యక్తమైంది. సాధారణంగా ఇళ్ల తలుపులు, కిటికీలు, ద్వార బంధాలకు విలువైన కలప వాడటం అందరికి అలవాటైపోయింది. ఎంత ఖరీదైనా ఆలోచించకుండా తమ ఇళ్లు అందంగా ఉండటమే లక్ష్యంగా డబ్బులు వెచ్చిస్తుంటారు. దీనిలో భాగంగానే ఈ సిమెంట్‌ సామగ్రిని అధికశాతం మంది వినియోగించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన ఎన్టీఆర్‌ గృహాలు, ప్రధానమంత్రి అవాస్‌ యోజన గృహాలకు రూ.1.75లక్షలు, రూ.రెండు లక్షల చొప్పున అంచనా వ్యయంగా పేర్కొంటూ అర్హులకు ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 1250 ఇళ్లను కేటాయించింది. ఇవి కాకుండా సుమారు 200 వరకూ అవాస్‌ యోజన ఇళ్లను కేటాయించింది. వీరంతా ఒకేసారి ఇళ్లు నిర్మిస్తే నిర్మాణ సామగ్రికి గిరాకీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మరోసారి గృహనిర్మిత కేంద్రాలను సామగ్రిని రంగంలోకి దించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

సిమెంట్‌ ఇటుకలతో ఆదా….
మిగిలిన సామగ్రి మాట ఎలా ఉన్నా సిమెంట్‌ ఇటుకలకు మాత్రం విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మెట్రో నగరాల్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలకు వీటిని వాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల సాధారణ ఇటుకలయ్యే ఖర్చులో 20 నుంచి 30 శాతం వరకు ఆదా అవుతోంది. అందుకే సిమెంట్‌ ఇటుకల పరిశ్రమలు ఇటీవల కాలంలో ప్రైవేట్‌ రంగంలో అడుగడుగునా ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు దీని విలువ సుమారు రూ.10 నుంచి రూ.11 వరకూ ఖర్చవుతుంది. ఒక గ్రామంలో ఎక్కువ మంది ఒకేసారి రప్పించుకుంటే రవాణా ఖర్చులలోనూ ఆదా అయ్యే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చని పేర్కొంటున్నారు.

సామగ్రిపై నిర్బంధం లేదు
ఇంటి నిర్మాణానికి సంబంధించి గృహనిర్మిత కేంద్రాల్లో తయారయ్యే సామగ్రి తీసుకోవడం తప్పనిసరి కాదు. ఈ విషయంలో మేము, సిబ్బంది బలవంతం చేయం. కాబట్టి లబ్ధిదారులు ఎలాంటి సామగ్రిని అయినా వినియోగించినా అభ్యంతరం లేదు. ఇంటిని మాత్రం సకాలంలో పూర్తి చేసుకోవాలి.

– లక్ష్మణమూర్తి, డీఈఈ, గృహనిర్మాణ శాఖ, చోడవరం

Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo