నిరంతరం ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలి: ఏయూలో డిజిటల్ అప్లికేషన్స్పై సదస్సు

ఏయూ ప్రాంగణం:
నిరంతరం విద్యార్థులు తమ ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని ఇంక్చర్ టెక్నాలజీస్ సంస్థ సీఈవో సచిన్ వర్మ కోరారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం డిజిటల్ అప్లికేషన్స్ అన్న అంశంపై జరిగిన సదస్సులో సచిన్ వర్మ ప్రసంగించారు. అభ్యసనను జీవితాంతం అలవాటుగా కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు. ఎవరికి వారు నిత్యం అభివృద్ధి చేసుకొనేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలనీ కోరారు. డిజిటల్ అప్లికేషన్స్పై నిర్వహించిన సదస్సును సచిన్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాజీ రిజిస్ట్రారు ఇంజినీరింగ్ సైన్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల మధ్య ఉన్న అంతరాన్ని తొలిగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే విద్యార్థులకు ఎప్పటికప్పుడు నిపుణుల ప్రసంగాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సదస్సులో ముఖ్యఅతిథిగా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి.ఎస్.అవధాని పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ అప్లికేషన్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సచిన్వర్మను ప్రధాన అచార్యులు అవధాని చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆచార్యులు నరేష్ చిట్టినేని, కె.వెంకటరావు తదితరులు ప్రసంగించారు. పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.