News

Realestate News

కోస్టుగార్డు ఐజీ సందర్శన

కోస్టుగార్డు ఐజీ సందర్శన
సింధియా, న్యూస్‌టుడే : భారతీయ తీరగస్తీదళం విశాఖపట్నం కార్యాలయాన్ని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రాజన్‌ బర్గోత్రా సందర్శించారు. ఈయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 5న విశాఖ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం తీరగస్తీదళ సిబ్బంది రూపొందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈయన నగరంలోని గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. రాజన్‌ బర్గోత్రా సతీమణి నిధి బర్గోత్రా పాల్గొని విశాఖపట్నం తీరగస్తీదళ సిబ్బంది భార్యల సంక్షేమ సంఘ సభ్యులను కలుసుకుని యోగక్షేమాలను, కమిటీ పనితీరుని అడిగి తెలుసుకున్నారు.