News

Realestate News

నాణ్యతకు మారుపేరు విశాఖ ఉక్కు

నాణ్యతకు మారుపేరు విశాఖ ఉక్కు

ఉక్కునగరం: నాణ్యమైన ఉత్పత్తులకు మారుపేరు విశాఖ ఉక్కు అని ఉక్కు సీఎండీ పి.మధుసూదన్‌ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని బీబీ గూడెం రోడ్డులో విశాఖ ఉక్కు నూతన స్టాక్‌యార్డును ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం రిటైలర్లు, ఖాతాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉక్కు పాలసీతో రానున్న రోజుల్లో ఉక్కు వినియోగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్కు డైరెక్టర్‌ రాయ్‌ చౌదరి, ఈడీ పి.ఎస్‌.గుప్తా, జె.సత్యనారాయణ, ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo