నర.. హరి.. గిరి… భక్తి ఝరి

ఎటుచూసినా రద్దీ..: సమోసాలు, ఖర్జూరాలు, ఉప్మా, పూరీలు… ఒకటేమిటి భక్తులు ఏది కోరితే అది… వివిధ సంఘాలు, ప్రముఖ వ్యాపారులు, ప్రజలు ఎక్కడికక్కడ సేవా కేంద్రాలను భారీగా ఏర్పాటు చేశారు. భక్తులను పిలిచి మరీ ఆతిథ్యమిచ్చారు. ప్రతీ స్టాల్ దగ్గరా భారీ రద్దీ కనిపించింది. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు నుంచి హనుమంతవాక, కైలాసగిరి, బీచ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో భక్తుల్ని అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.

గిరిప్రదక్షిణకు 10 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నాం. నేను జాతీయ రహదారి మీద నుంచి సింహాచలం వైపు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇంత రద్దీని చూడలేదు. అందుకే సమయానికి రాలేకపోయా. గతంకన్నా భక్తుల సంఖ్య పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదక్షిణ కోసం వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ప్రణాళికబద్ధంగా చేసిన అధికారులందరికీ అభినందనలు. తొలిపావంచాను ఈసారి విస్తరించుకోవడంతో రథయాత్ర ప్రారంభోత్సవాన్ని మరింత వైభవంగా జరుపుకొనేందుకు, భక్తులు చూసి తరించేందుకు అవకాశం ఏర్పడింది.