నర్సీపట్నంలో జిల్లాస్థాయి బాలల ప్రతిభా పోటీలు
నర్సీపట్నంలో జిల్లాస్థాయి బాలల ప్రతిభా పోటీలు
ప్రచార పత్రాలు విడుదల చేసిన మంత్రి అయ్యన్న
బాలల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు పి.ఆర్.టి.యు.
ఏటా జిల్లాస్థాయిలో నర్సీపట్నంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
బుధవారం రాత్రి పి.ఆర్.టి.యు నాయకులతో కలిసి బాలల ప్రతిభ పోటీలు ప్రచార పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను ఈ పోటీలకు పంపడం ద్వారా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పి.ఆర్.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.జి.నాథ్ మాట్లాడుతూ నర్సీపట్నం ప్రధాన జడ్పీ హైస్కూల్లో నవంబరు 2న చిత్రలేఖన పోటీ, 3న దేశభక్తి
గీతాల బృందగాన పోటీ, 5న సుమతీ, వేమన శతకాలపై పద్యపఠన పోటీ, 9, 10 తేదీల్లో ప్రకృతి వైపరీత్యాలు- ప్రభుత్వం- ప్రజల భాధ్యత అనే
అంశంపై వ్యాసరచన పోటీ, 11న వర్తమాన అంశాలు,
క్రీడలు, రాజకీయ అంశాలపై క్విజ్, 12న నా కలల స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఉండాలంటే అనే అశంపై వక్తృత్వ పోటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
13న విచిత్ర వేషధారణ, జానపద నృత్యాల ఎంపికలు ఉంటాయని తెలిపారు.
14న సిటీక్లబ్ ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలు, బహుమతి ప్రదానం ఉంటుందని వివరించారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, గాదే శ్రీనివాసుల నాయుడు,
పురపాలిక వైస్‌ఛైర్మన్ సన్యాసిపాత్రుడు పాల్గొంటారని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అల్లు అప్పారావు, ఎం.వి.ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.