News

Realestate News

నగర వేదికగా అంతర్జాతీయ కిక్‌ బాక్సింగ్‌ పోటీలు జరగాలి

Real Estate News

వచ్చే నెల 3 నుంచి జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీలు
ట్రోఫీ ఆవిష్కంచిన మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్‌ పోటీలకు నగరం వేదిక కావాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఇప్పటికే నగరంలో పలు క్రీడలు జాతీయ స్థాయిలో జరిగాయన్నారు. వచ్చే నెల 3 నుంచి 7 వరకు నగరంలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జరగనున్న 21వ జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్‌ పోటీలకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకిచ్చే ట్రోఫీలను మంగళవారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు దసపల్లా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ క్రీడా హబ్‌గా తయారైందని, అధునాతనమైన అంతర్జాతీయ క్రీడా సౌకర్యాలతో కూడిన స్టేడియాలు త్వరలో రాబోతున్నాయన్నారు. ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండే విధంగా ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందన్నారు. క్రీడలతో పాటు సాంస్తృతిక కార్యక్రమాలు పాఠశాలల్లో ఉంటాయన్నారు. పతకాలు గెలుపొందిన వారికి గ్రేస్‌ మార్కులు ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌, ఎ.పి.కిక్‌బాక్సింగ్‌ సంఘం అధ్యక్షుడు కరణంరెడ్డి నర్సింగరావు, బి.కాశీవిశ్వనాథం, జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్‌.రవీంద్ర రాష్ట్ర సంఘం కార్యదర్శి జి.ఆనందబాలు, ప్రధాన సలహాదారుడు వై.ప్రభాకరరావు, కె.నర్సిరెడ్డి, పి.ఎల్లంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo