News

Realestate News

నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌

నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌
రూ. 62 కోట్లతో ఏర్పాటు కానున్న సృజనాత్మక – అంకుర సంస్థ
ఎస్టీపీఐ – వుడా సంయుక్త ఆధ్వర్యంలో పనులు
ఈనాడు – విశాఖపట్నం: నగరం నడిబొడ్డున ఐటీ టవర్‌ నిర్మించడానికి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) – సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కు ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ) సన్నాహాలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఒప్పందం కుదిరినా.. అనిశ్చితి నెలకొనడంతో ఇంతకాలం ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ సంస్థ నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ సృజనాత్మక – అంకుర సంస్థ ఏర్పాటుకు మార్గం  సుగమయింది. రూ. 62 కోట్లతో నిర్మించనున్నారు.  ఐటీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ల సమక్షంలో 2016 ఫిబ్రవరిలో ఒప్పందం కుదరింది. ఇందుకోసం రూ. 16 కోట్ల విలువైన స్థలాన్ని వుడా ఇవ్వాలి. రూ. 46 కోట్లను ఎస్టీపీఐ భరించాల్సి ఉంటుంది. సాధారణంగా వుడా పరిధిలో చేపట్టే ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పర్యవేక్షణ అంతా ఆ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఐటీ టవర్లను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంటు (సీపీడబ్ల్యూడీ) విభాగం ఆధ్వర్యంలో నిర్మించాలని ఎస్టీపీఐ ప్రతిపాదించడంతో సమస్య వచ్చింది. వుడాకు ఎస్టీపీఐకి మధ్య పాలనాపరమైన విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. తాజాగా పర్యవేక్షణ బాధ్యతలను వుడా స్వీకరించడానికి సంబంధిత సంస్థ అంగీకరించడంతో కదలిక వచ్చింది. ప్రాజెక్టు మేనేజ్‌మెంటు యూనిట్‌ (పీఎంయూ)గా వుడా వ్యవహరిస్తూ ప్రణాళిక, టెండర్లు ప్రక్రియ దిశగా కసరత్తు మొదలుపెట్టింది.  ఐటీ టవర్‌లో మెరైన్‌, పెట్రోలు, విద్యుత్తు రంగాలకు ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాలను వృద్ధి చేస్తారు.

ఎక్కడ: సిరిపురం కూడలిలో వుడా ఉద్యోగ భవన్‌ వెనుక
విస్తీర్ణం: ఎనిమిది అంతస్తుల్లో లక్ష చదరపుఅడుగులు
అంచనా వ్యయం: రూ. 62 కోట్లు


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo