News

Realestate News

నగరంలో ప్రపంచ విపత్తుల కాంగ్రెస్‌ సదస్సు

నగరంలో ప్రపంచ విపత్తుల కాంగ్రెస్‌ సదస్సు
మార్గదర్శకాల ప్రతిని విడుదల చేసిన ముఖ్యమంత్రి
విశాఖపట్నం: మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. విపత్తుల నిర్వహణకు సంబంధించిన ఈ సదస్సు వచ్చే ఏడాది నాలుగు రోజులపాటు నగరంలో జరగనుంది. గతేడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాలు, నియంత్రణ సంస్థ (డీఎమ్‌ఐసీ) ఆధ్వర్యంలో విశాఖలోనే ఈ సదస్సు నిర్వహించారు. రెండో ప్రపంచ కాంగ్రెస్‌ విపత్తుల నిర్వహణకు సంబంధించిన 800 పేజీల మార్గదర్శకాల ప్రతిని డీఎమ్‌ఐసీ అధ్యక్ష, కార్యదర్శులు డీఆర్‌ఎస్‌ ఆనందబాబు, అడుసుమిల్లి సురేష్‌ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అమరావతిలో అందజేశారు. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు వీరు తెలిపారు. గతేడాది సదస్సుకు 40 దేశాల ప్రతినిధులు హాజరవగా, ఈసారి 100 దేశాల నుంచి రావచ్చని చెప్పారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo