నక్కపల్లిలో నవనిర్మాణ దీక్ష

నక్కపల్లి: నక్కపల్లిలో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రారంభించారు. పాయకరావుపేట నియోజకవర్గ స్థాయిలో నక్కపల్లి ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కవోని దీక్షతో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ప్రజలతో నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు నర్సింహారావు, రమణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.