News

Realestate News

దేశ సంక్షేమానికి వెన్నెముకగా మహిళా రైతులు.


దేశ సంక్షేమానికి వెన్నెముకగా మహిళా రైతులు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే:దేశ సంక్షేమానికి వెన్నెముకగా మహిళా రైతులు.

దేశ సంక్షేమానికి మహిళా రైతులు వెన్నెముకగా నిలుస్తున్నారని జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ లాలం భవాని

పేర్కొన్నారు.

జాతీయ మహిళా రైతు దినోత్సవం ఏయూ వైవీఎఎస్‌ మూర్తి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని మాట్లాడుతూ..

వ్యవసాయంలో భర్తకు చేదోడుగా ఉంటూ మహిళలు ఆర్థిక పరిపుష్ఠిని సాధిస్తున్నారన్నారు.

వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక శాఖల్లో అభివృద్ధి సాధించిన మహిళా రైతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను

అందజేశారు. వ్యవసాయ, పశుసంవర్థక, పట్టు పరిశ్రమల శాఖల నుంచి 12 మందికి అవార్డులను అందజేశారు.

వ్యవసాయ శాఖ నుంచి జి.సత్యవతి (డి.గొండూరు), ఎస్‌.నాగమణి (కృష్ణాపురం), బంటు తులసమ్మ (ఒంటిపాక), కోడూరు భువనేశ్వరి (చీడికాడ),

పి.నాగలక్ష్మి (చుంచుకొండ), నల్లబెల్లి వెంకట అచ్చియమ్మ (నర్సీపట్నం) అవార్డు అందుకున్నారు.

ఉద్యాన శాఖ నుంచి నడింపల్లి వెంకటలక్ష్మీదేవి (దేవరాపల్లి మండలం), కొల్లి సత్యవతి (దొప్పర్ల), పశుసంవర్థశాఖ నుంచి సబ్బి మహాలక్ష్మి

(వెంకటరామపురం), పెంటకోట ఉషాపావని (చుంచుకొండ), కిల్లి జమున (కిల్లి గూడ), పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఎ.కుమారి (రామచంద్రపురం,

కోటరవుట్ల మండలం) అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఆదరణకుమార్‌, ఆత్మ పీడీ అప్పలస్వామి, ఉద్యానశాఖ డీడీ గోపి కృష్ణ, ఎడీ శైలజ, పశుసంవర్థక శాఖ ఏడీ

రామ్మోహన్‌, డీడీ రామారావు, ఏడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo