News

Realestate News

దేశ రక్షణకు మేము సిద్ధం


దేశ రక్షణకు మేము సిద్ధం

ఎన్‌.సి.సి. కేడెట్స్‌కు సీ పరీక్ష ప్రాక్టికల్స్‌

దేశ రక్షణకు మేము సిద్ధం

నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌.సి.సి.) సి సర్టిఫికెట్‌ ప్రాక్టికల్స్‌ ఉత్సాహంగా జరిగింది.

2(ఎ) ఆంధ్ర బాలికల బెటాలియన్‌ విజయనగరం పరిధిలోని 9 కళాశాలల నుంచి మొత్తం 176 మంది బాలికా కెడెట్స్‌

ప్రాక్టికల్స్‌కు హాజరయ్యారు.

ఆదివారం ఉదయం ఎంవీపీకాలనీ ఎ.ఎస్‌.రాజా కళాశాలలో జరిగిన ప్రాక్టికల్స్‌ను కమాండింగ్‌ ఆఫీసర్‌ కర్నల్‌

జె.పి.పాండా, ఎ.ఒ. లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ కృష్ణమూర్తి, ఎ.ఎన్‌.ఒ. కెప్టెన్‌ వెంకట్‌లు పర్యవేక్షించారు.

ముందుగా కమాండింగ్‌ ఆఫీసర్‌ కర్నల్‌ జె.పి. పాండా వద్ద రిపోర్టింగ్‌ ఇచ్చారు.

ఇక మ్యాప్‌ పాయింటింగ్‌లో కూడా బాలికా కెడెట్స్‌ ప్రతిభ కనబరిచి, మెప్పించారు.