News

Realestate News

దేశంలో మొదటి అందమైన నగరంగా విశాఖ

in the world first wonderful city vizag

దేశంలో మొదటి అందమైన నగరంగా విశాఖ
అభివృద్ధిలోనూ అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం
పర్యాటక, వైద్య, పారిశ్రామిక రంగాలకు పెద్దపీట
సెంట్రల్‌ పార్కు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి
విశాఖపట్నం, ఈనాడు: ‘దేశంలో అందమైన, అభివృద్ధి చెందిన మహా నగరాల్లో విశాఖను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రత్యేకించి పర్యాటక, వైద్య-ఆరోగ్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అనేక కార్యక్రమాలను రాబోయే రోజుల్లోనూ నిర్వహిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం రాత్రి విశాఖ సెంట్రల్‌ పార్కుని ప్రారంభించిన ఆయన అనంతరం అదే ప్రాంగణంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. పర్యాటకరంగ అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. త్వరలో ‘కన్వెన్షన్‌ సెంటర్‌’ ఏర్పాటు చేస్తామని, జనవరిలో మరోసారి అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సును విశాఖలో నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఈనెల 23న అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్రిక్స్‌ సదస్సు నిర్వహణతోనూ అంతర్జాతీయంగా విశాఖ గుర్తింపు పొందిందన్నారు.

మరో నాలుగు చోట్ల పార్కులు…
సెంట్రల్‌ పార్కు తరహాలో గాజువాక, ముడసర్లోవ, భీమునిపట్నం, అనకాపల్లిలో మరో నాలుగు పార్కుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సెంట్రల్‌ పార్కు ఎంతో అద్భుతంగా ఉందని, నగరం నడిబొడ్డున ఇంత అందమైన ఉద్యానవనం ప్రజలకు అందుబాటులోకి రావడం గొప్ప విషయమన్నారు. వుడా అధికారులను అభినందించారు. విశాఖ చిల్డ్రర్‌ థిµయేటర్‌ను నవంబరు 14న ప్రారంభిస్తామని ప్రకటించారు. దసరా నుంచి హెలీ టూరిజం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గణబాబు, బండారు సత్యనారాయణ మూర్తి, విష్ణుకుమార్‌రాజు, పల్లా శ్రీనివాస్‌, పీలా గోవిందసత్యనారాయణ, అనిత, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎంవీఎస్‌ మూర్తి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వుడా తరఫున ముఖ్యమంత్రి, మంత్రులకు అధికారులు జ్ఞాపికలు అందజేశారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo