దేశంలోనే విశాఖకు ప్రాధాన్యం

విశాఖపట్నం, న్యూస్టుడే: విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే పర్యాటక తదితర రంగాల పరంగా భీమిలి నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. రుషికొండ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్లతో కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు రూ.10 లక్షలతో ఇటీవల నిర్మించిన సామాజిక భవనానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ పరిధిలో ఆరు జోన్లతో పాటు భీమిలి, అనకాపల్లి ప్రాంతాల ప్రయోజనార్ధం దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి కొత్తగా సమకూర్చిన ఎనిమిది జేసీబీలను మంత్రి ప్రారంభించారు. జేసీబీని కొంతదూరం నడిపారు.