News

Realestate News

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాం!

world wind utsav, visakhapatnamrealestate news

మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టీకరణ
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జిల్లాతో పాటు నగరంలో కొన్నాళ్లుగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. బుధవారం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నగరంలో, సింహాచలం, గాజువాక తదితర ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి పరిష్కారం కాని స్థలాల పంపిణీ సమస్యను కొలిక్కి తెస్తున్నామన్నారు. 100 గజాలలోపు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు పంపిణీ గురువారం నిర్వహిస్తున్నామన్నారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి కేబినెట్‌లో చర్చించామని, అయితే హైకోర్టులో కేసు ఉండటంతో పట్టాలు ఇప్పుడు పంపిణీ చేయడంలేదని మంత్రి పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు రూ.148 కోట్ల మంజూరు…
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలనుకున్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులు సరిగాలేనందున గత ఏడాది ఒక్కొ మహిళకు రూ. 3 వేలు బ్యాంకులో జమ చేసిందని, మళ్లీ నిధులు మంజూరు చేయాలని నిర్ణయించిందన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 148 కోట్లు మంజూరు చేయనున్నారన్నారు. సీఎం చేతులమీదుగా ఆయా నిధులకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు అందజేస్తారన్నారు. నగరంలో నిర్వహించనున్న బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, ఏ కార్యక్రమ నిర్వహణ అయినా ప్రజాభిప్రాయం మేరకే జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీవీఆర్‌ నాయుడు, పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo