News

Realestate News

త్వరలో విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైలు

double-decker train

త్వరలో విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైలు
రైల్వే టూరిజంలో భాగంగా అరకు రైలుకు గ్లాస్‌ కోచ్‌లు
ఎం.పి. హరిబాబుకు వివరించిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: విశాఖ ఎం.పి., రాష్ట్ర భాజపా అద్యక్షుడు కె.హరిబాబు బుధవారం సాయంత్రం దిల్లీలో రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలిశారు. ముందుగా ఎం.పి. హరిబాబు మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను కోసం 2016-17 బడ్జెట్‌లో రూ.200 కోట్లు, పిఠాపురం- కాకినాడ లైనుకు రూ.50కోట్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైలు మంజూరైందని, త్వరలోనే రైల్వే టైమ్‌టేబుల్‌ను విడుదల చేసి విజయవాడ- విశాఖ మధ్య నడపనున్నట్లు మంత్రి సురేష్‌ప్రభు హరిబాబుకు వివరించారు. రైల్వే టూరిజం ద్వారా పర్యాటకులు కోసం అరకుకు పూర్తిగ్లాస్‌ కోచెస్‌ను మంజూరుచేస్తామని, వీటిని ఐ.ఆర్‌.సి.టి.సి. ద్వారా త్వరలోనే వినియోగంలోకి తెస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.