త్వరలో విశాఖ రైల్వే జోన్ సాకారం: గంటా

విశాఖ :
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్ త్వరలోనే సాకారం కానుందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారని, తర్వలోనే కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రానుందని చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల ప్రారంభోత్సవానికి మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు.