News

Realestate News

త్వరలో ఆటోనగర్‌ ప్రారంభం

Development works groundbreakings

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఆటోమొబైల్‌ రంగాన్ని ఒకచోటకు తీసుకొచ్చేందుకు త్వరలోనే ఆటోనగర్‌ను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం సైలాడ పైడితల్లి కల్యాణమండపంలో విశాఖ ఆటోనగర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వెయ్యి మంది ఆటోమొబైల్‌ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనందపురం మండలం, కనమాం గ్రామంలోని సర్వే నెంబరు 50లో ఉన్న 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆటోనగర్‌ నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయన్నారు. సంక్రాంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆటోనగర్‌ నిర్మాణం జరిగితే ప్రత్యక్షంగా వెయ్యి కుటుంబాలకు, పరోక్షంగా పదివేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఆటోమొబైల్‌ కార్మికులు సన్మానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ నజీర్‌, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండీ గౌస్‌, సంఘం అధ్యక్షుడు పఠాన్‌ఖాజా, గౌరవాధ్యక్షుడు ఎస్‌డీహెచ్‌ హుస్సేన్‌ పెద్దఎత్తున ఆటోమొబైల్‌ కార్మికులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo