త్వరలో ‘ఆకర్షణీయ’ పనులు ప్రారంభం
త్వరలో ‘ఆకర్షణీయ’ పనులు ప్రారంభం
ప్రజాభిప్రాయం మేరకే ప్రాజెక్టుల అమలు
కార్పొరేషన్, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఆకర్షణీయ నగర ప్రాజెక్టు డిజైన్లు ప్రజాభిప్రాయం మేరకే ఉంటాయని జీవీఎంసీ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎంపీ కంభంపాటి హరిబాబుతో కలిసి ఆయన సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి సవివర పథక నివేదిక(డీపీఆర్)లు తయారుచేసి, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. ఆకర్షణీయ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో అభివృద్ధి పనులు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక నగరాల్లో అమల్లో ఉన్న సౌకర్యాలను అందిస్తామన్నారు. బెంగళూరు తరహా రహదారులు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, మోడ్రన్ బస్‌స్టాప్‌లు, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, భూగర్భ మురుగునీటి వ్యవస్థలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులతో రహదారులపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఎయికాం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం తయారుచేసిన ప్రణాళికలన్నీ జీవీఎంసీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ప్రజలిచ్చే అభ్యంతరాలను స్వీకరించి, వాటికి అనుగుణంగా మార్పులు చేయాలన్నారు. వాల్తేరు ప్రధాన రహదారి 4.9 కిలోమీటర్లు, చినవాల్తేరు 2.1 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని ఎయికాం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ హరినారాయణ్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్, ఆర్టీసీ సీటీఎం సత్యనారాయణ, ఎయికాం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399