తెలంగాణలో పొడి వాతావరణం
తెలంగాణలో పొడి వాతావరణం

ఈనాడు, హైదరాబాద్:తెలంగాణలో పొడి వాతావరణం
రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
ఉత్తరకోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుపాను వ్యతిరేక గాలులు ఉత్తరాది శీతలగాలులను అడ్డుకుంటున్నాయని చెప్పారు.
ప్రస్తుతం తూర్పు,
ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి.
ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా మెదక్లో 11, రామగుండంలో 13, ఆదిలాబాద్లో 14, హైదరాబాద్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పగటిపూట సాధారణంకన్నా 3 డిగ్రీలు పెరిగి గరిష్ఠంగా మహబూబ్నగర్లో 33 డిగ్రీలు నమోదైంది.
రాత్రిపూట చలి సాధారణ స్థాయిలో ఉంటోందని రాజారావు తెలిపారు.