News

Realestate News

తీరంలో అలజడి,ముందుకొచ్చిన సముద్రం

తీరంలో అలజడి
సునామీ హెచ్చరికలతో..
ముందుకొచ్చిన సముద్రం
కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: భారత తూర్పు ప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ నెల 25 నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఒకటిన్నర మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం(ఇన్‌కాయిస్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలోమంగళవారం ఉదయం నుంచి విజయనగరం జిల్లావ్యాప్తంగా వాతావరణం మేఘావృతమైంది. ఉదయం నుంచే జిల్లా అంతటా ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు కురిశాయి. పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాకు సైతం సునామీ హెచ్చరికలు జారీ కావడంతో భోగాపురం, పూసపాటిరేగ తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడటం, సముద్రం ముందుకు రావడంతో నాటి సునామీని గుర్తు చేసుకుని ఆందోళనకు గురయ్యారు. మరోవైపు జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయం నుంచే హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, ఇప్పటికే లోపలికి వెళ్లిన వారు తిరిగి రావాలని సూచించారు. వలలు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo