News

Realestate News

తహసిల్దార్ల పోస్టింగ్‌ల్లో మార్పులు

తహసిల్దార్ల పోస్టింగ్‌ల్లో మార్పులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: జిల్లాకు కేటాయించిన తహసిల్దార్ల పోస్టింగ్‌ల్లో పలు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 46 మంది తహసిల్దార్లు జిల్లాకు వచ్చారు. వీరందరికీ ఈనెల 9న పోస్టింగ్‌లు కేటాయిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉత్తర్వుల ప్రకారం 20 మంది ఈనెల 10న విధుల్లో చేరారు.

మరో 25మంది వరకు చేరలేదు. చేరని వారందరికీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తొలుత కేటాయించిన పోస్టుల్లో చేరొద్దని కలెక్టరేట్‌ నుంచి సమాచారం వెళ్లింది. ఈనెల 11న విజయవాడలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కలెక్టర్‌ భాస్కర్‌ మంగళవారం తిరిగి విశాఖకు చేరుకున్నారు.రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోస్టింగ్‌ల విషయమై దృష్టి సారించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుగా ఇచ్చిన పోస్టింగ్‌ల్లో కొంతమంది తహసిల్దార్లకు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. దీంతో జిల్లాకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు కినుక వహించారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం 2014 ఎన్నికల్లో పని చేసిన మండలాలకు మళ్లీ కేటాయించకూడదు. అయితే ఒకరిద్దరి విషయంలో అలాగే జరిగినట్లు సమాచారం. ఆయా మార్పులకు అనుగుణంగా బుధవారం పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo