News

Realestate News

తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాదే పైచేయి

Visakhapatnam News

తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాదే పైచేయి
కలెక్టర్ల సదస్సులో సీఎం వెల్లడి
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తలసరి ఆదాయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ముందుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు సారాంశాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్సు సమావేశమందిరంలో జేసీ-2 డి.వి.రెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, సీపీవో రామశాస్త్రి, గృహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,07,532గా ఉంటే విశాఖ జిల్లాలో 1,40,648గా ఉందని చెప్పారు. గాజువాక, అచ్యుతాపురం మండలాలు అగ్రస్థానంలో నిలిచాయన్నారు. స్థూల వృద్ధిరేటు నమోదులో 12.32 శాతంతో విశాఖ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందని చెప్పారు. అధికారులు మరింతగా శ్రమించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. ఉదయం నుంచి బాగా పొద్దుపోయే వరకూ వీడియో కాన్ఫరెన్సు కొనసాగింది. ఇది కొనసాగినంతసేపు కలెక్టరేట్‌లో అంతర్జాల సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo