News

Realestate News

డీఎం తనిఖీలపై ఢీ


డీఎం తనిఖీలపై ఢీ

బస్సులు నిలిపేసి ఉద్యోగుల ఆందోళన
మధ్యాహ్నానికి సద్దుమణిగిన వివాదం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే:  డీఎం తనిఖీలపై ఢీ

తనిఖీల పేరుతో ఆర్టీసీ పాడేరు డిపో మేనేజరు రమేష్‌ ఉద్యోగులపై దురుసుగా

ప్రవర్తించారని ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండుతో డ్రైవర్లు, కండక్టర్లు గురువారం ఆందోళనకు

దిగారు.

డీఎం రమేష్‌ బుధవారం రాత్రి విశ్రాంత గదులను తనిఖీ చేసి డ్రైవర్లు, కండక్టర్లకు బ్రీత్‌ ఎనలైజర్‌తో శ్వాస పరీక్షలు

నిర్వహించారు.

ముగ్గురు ఉద్యోగులు మద్యం తాగి ఉండటాన్ని గమనించి వారిని విశ్రాంత గది నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముగ్గురు ఉద్యోగులకు మద్దతుగా డ్రైవర్లు, కండక్టర్లు కాంప్లెక్సు ఎదుట రహదారిపై

బైఠాయించి గురువారం మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించారు. గిరిజన ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సింహాద్రి,

సభ్యులు అక్కడకు చేరుకుని ఆందోళనకు మద్దతు తెలిపారు.

డిపోలో ఉద్యోగుల ఆందోళనతో బస్సులు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న జిల్లా డిప్యూటీ సీటీఎం (ఆర్‌)

వెంకటరమణ పాడేరు చేరుకున్నారు.

ఆందోళన చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నాయకుడు రమణ మాట్లాడుతూ..

డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంత గదులను తనిఖీ చేయడంతోపాటు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు

నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లె వెలుగు సర్వీసుల స్థానంలో నడుపుతున్న ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను రద్దు చేయాలన్నారు.

డిప్యూటీ సీటీఎం వెంకటరమణ హామీ మేరకు డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.