News

Realestate News

టీటీలో ఉచిత శిక్షణ ప్రారంభం

టీటీలో ఉచిత శిక్షణ ప్రారంభం
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: టేబుల్‌ టెన్నిస్‌లో ఉచితంగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం సాలిగ్రామపురం భారతీయ విద్యాభవన్స్‌ పాఠశాలలో ప్రారంభమైంది. శిబిరాన్ని ద ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు టి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు డి.ఎస్‌.వర్మ, జిల్లా టేబుల్‌టెన్నిస్‌ సంఘం కార్యదర్శి డి.వై.వి.శర్మలు హాజరై ప్రారంభించారు. వారు క్రీడాకారులుద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో ఇప్పటికే పలు క్రీడల్లో ఉచిత శిక్షణ శిబిరాలు జరుగుతుండగా అదనంగా టేబుల్‌టెన్నిస్‌ను చేర్చారన్నారు. శిక్షణలో పాల్గొన్నవారందరికీ ప్రతి రోజు పౌష్టికాహారంతో పాటు టీషర్టులను అందిస్తుండడంతో అధిక సంఖ్యలో క్రీడాకారులు శిబిరాల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. వేసవి శిబిరాలు ముగియగానే ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు టేబుల్‌ టెన్నిస్‌లో ఏడాది పొడవునా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం కార్యదర్శి బి.రామయ్య, కోచ్‌ రవికుమార్‌, బీవీకే కళాశాల పీడీ చక్రవర్తి, పాఠశాల ఇన్‌ఛార్జి రాజ్యలక్ష్మి, రత్న ప్రసాద్‌ పాల్గొన్నారు.