News

Realestate News

జూన్‌ 28న సింహగిరిపై వూంజల్‌ సేవ

జూన్‌ 28న సింహగిరిపై వూంజల్‌ సేవ

అడివివరం, న్యూస్‌టుడే: ఒడిశా ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంతనాయకో దాసుడు ఆధ్వర్యంలో సింహగిరిపై అప్పన్న స్వామికి జూన్‌ 28వ తేదీన వూంజల్‌ ఆర్జిత సేవ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈమేరకు శనివారం లక్ష్మీకాంతనాయకో దాసుడు ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాలాచార్యులు, ఏఈవో ఎంవీ కృష్ణమాచార్యులు, సూపరింటెండెంట్‌ కృష్ణారావుతో చర్చించారు. వూంజల్‌ సేవ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒడిశాకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. తొలుత భక్త బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.