News

Realestate News

జీవో వచ్చేసింది!

Real Estate in Gajuwaka

గాజువాక భూముల క్రమబద్ధీకరణపై 301 ప్రత్యేక ఉత్తర్వులు జారీ
ఇక సమగ్ర సర్వే

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక హౌస్‌కమిటీ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గత నెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం బుధవారం కొత్తగా జీవో నెంబరు 301 పేరుతో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మూడు నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు.
గత మే 9న గాజువాకలో 900 ఎకరాల హౌస్‌కమిటీ భూముల క్రమబద్దీకరణకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జూన్‌ 24న మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది.

* వంద, వెయ్యి చదరపు గజాలు, అంతకుమించి విస్తీర్ణంలో స్థలాలను కలిగి ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం లోగడ చేసిన సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
* 100 గజాల్లోపు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగానే క్రమబద్దీకరిస్తారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకున్న వారు, దారిద్య్రరేఖకు ఎగువ ఉన్నవారికి ఎంత ధర నిర్ణయించాలన్న దానిపై అధికారులు నిర్ణయం అధికారులు తీసుకుంటారు.
* 2008లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం: 296, 2015లో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి 2014 జనవరి 1 నాటికి అనుభవదారులుగా ఉన్న వారికి భూములను క్రమద్దీకరిస్తారు. గాజువాక పరిధిలోకి వచ్చే భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏఏ భూములు ఈ పరిధిలోకి వస్తాయన్న అంశాన్ని గతంలో శాసనసభ కమిటీ చేసిన సిఫార్సులో పేర్కొన్నారు. వాటినే పరిగణలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 20 వేల కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.

ఆనంద వేడుక..
జీవో నెంబరు 301 జారీ చేయడంతో గాజువాకలో తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్‌, ప్రసాదుల శ్రీనివాస్‌, పిల్లల మోహనరావు, గోమాడ వాసు పాల్గొని ఎమ్మెల్యేకు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లనాటి సమస్యను కొలిక్కి తేవడానికి చేసిన కృషి చేసిన ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు మహిళలు సుజాత, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.