News

Realestate News

జిల్లాలో 12 వేల ఇళ్ల ప్రారంభానికి చర్యలు

ఊరూరా పండగ..సొంతింట్లో నిండుగ!
20న సామూహిక గృహ ప్రవేశాలు
జిల్లాలో 12 వేల ఇళ్ల ప్రారంభానికి చర్యలు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: పేదల గూళ్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈనెల 20న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడానికి గృహనిర్మాణ సంస్థ సన్నద్ధమవుతోంది. జిల్లాలో 12 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయడానికి లబ్ధిదారులను సిద్ధం చేస్తున్నారు. డివిజన్లు, పథకాల వారీగా ఎన్ని ఇళ్లు పూర్తిచేశారు.. ఎన్ని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయో గుర్తిస్తున్నారు. తుదిదశలో ఉన్న ఇళ్లను గృహ ప్రవేశం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చేయాలని ఆ సంస్థ క్షేత్ర సిబ్బందికి సూచిస్తున్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై గృహనిర్మాణ సంస్థ ఈఈ, డీఈ, ఏఈలతో పీడీ ఎంజీఎస్‌ ప్రసాద్‌ వారం రోజులుగా సమీక్షిస్తున్నారు.  జిల్లాలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో 2016-17 సంవత్సరానికి 12,950 ఇళ్లు మంజూరు చేశారు. ఇదే పథకంలో 2017-18 సంవత్సరానికి 12,250 ఇళ్లు, 2018-19కి 11,000 ఇళ్లను ముందుగానే మంజూరు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎమ్‌ఏవై-జి) గ్రామీణ పథకంలో జిల్లాకు 5,560 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో సుమారు 23 వేల ఇళ్లకు పైగా నిర్మాణాలను పూర్తిచేశారు. గతేడాది అక్టోబర్‌ 2న ప్రపంచ ఆవాస దినోత్సవం, గాంధీ జయంతిని పురస్కరించుకుని 7,842 ఇళ్లలో మొదటి విడత సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ప్రతి ఇంటిపైనా లబ్ధిదారు పేరు.. పథకం.. మంజూరు గుర్తిపు సంఖ్య వంటి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
ఆకర్షణీయంగా..: ఎన్టీఆర్‌ గృహనిర్మాణం, పీఎంఏవై పథకాల్లో మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు వారి అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయంగా నిర్మించుకున్నారు. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకంలో గరిష్ఠంగా రూ.70 వేలు మాత్రమే లబ్ధిచేకూరేది. తెదేపా ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్‌ గ్రామీణ పథకంలో ఇళ్లకు రూ.1.5 లక్షలు, పీఎంఏవై పథకంలో ఇళ్లకు రూ.2 లక్షలు ప్రభుత్వ సాయం అందుతోంది. దీంతో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఇళ్లను చూడముచ్చటగా నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ సాయానికి కొంత అదనంగా ఖర్చుచేసి కొంతమంది ఇళ్లను సుందరంగా నిర్మించుకున్నారు. గృహనిర్మాణ కాలనీలు సైతం ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. పూరిపాకల్లో.. పాడుబడిన ఇళ్లల్లో.. ఇరుకిరుకు అద్దె కొంపలతో ఇన్నాళ్లు సావాసం చేసిన లబ్ధిదారులంతా సొంత గూళ్లలోకి ఒకే సారి గృహప్రవేశాలు చేయించి వారిలో ఆనందాన్ని నింపుతున్నారు.
పండగ వాతావరణంలో..
సామూహిక గృహప్రవేశాలను ప్రతి గ్రామంలోనూ పండగ వాతావరణంలో జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. పచ్చని పందిళ్లు.. అరటి చెట్లతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి పల్లెలకు ఉత్సవశోభను తీసుకువచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాపతినిధులను భాగస్వామ్యులను చేసి పండగలా గృహ ప్రవేశాలను నిర్వహించడానికి ప్రణాళిక చేస్తున్నారు. ఈ మేరకు నేతలను కలిసి ఇళ్ల ప్రారంభానికి సంబంధించి ఆహ్వానాలను అందజేయడానికి సిద్ధమవుతున్నారు.ఘనంగా చేపడతాం..
జిల్లాలో రెండో విడత సామూహిక గృహప్రవేశాల్లో భాగంగా 12 వేల ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించి కార్యచరణను తయారుచేసి అధికారులకు అందజేశాం. వారి పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి గృహప్రవేశాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం.

– ఎంజీఎస్‌ ప్రసాద్‌, గృహనిర్మాణ సంస్థ, పథక సంచాలకులు

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo